విచ్చిన మల్లె
నీ
నవ్వు
తల పంకించే
ఆకు
నీ
నడక
పూ రేకు
ఎర్రదనం
నీ
సిగ్గు
ముద్దబంతి
నీ
ఛాయ
సెలనీటిపై
కాగితం పడవలు
నీ
మాటలు
అలల తాకిడి
నీ
జోలపాట
అమావాస్యే
నువు
లేకపోతే
దారంతా
సంపెంగ పరిమళాలు
నువ్వెళ్ళావని
కల్లాపి పై
వాకిట ముగ్గు
నా
నువ్వు
గ్రీష్మం
నీ
నిరీక్షణలో
గదంతా
వెన్నెల దుప్పటి
నీ
మోహం
అరుణ్ కుమార్ మరపట్ల
Arun Kumar Marapatla