Wednesday, December 8, 2010

పొన్నచెట్టు నీడకింద
మునిమాపు వేళల్లో
ఏమీలేని మనమధ్య
కబుర్లాడుతూ నాతో
ఓ అందమైన ప్రేమకి
ఊహనౌతాను
కొన్ని జ్ఞాపకాలు నీతో


నీ అన్వేషణలో
నా ఆనందాల్ని
వెదుక్కుంటూ స్వప్నిస్తాను
ఎన్ని జన్మలెత్తాలి నీ సాంగత్యానికి!!!
కలవో నా నిజానివో!!!
ఎవరివి నీవు?



అరుణ్‌ కుమార్‌ మరపట్ల
Arun Kumar Marapatla
ఈ కల్మష హ్రుదయ శుద్ధికి
ఎన్ని ఉప్పటి కన్నీళ్ళు కావాలి
పసి హ్రుదయం కోసం
ఎన్ని శుభ్రవేదనలు కావాలి!
ఎన్నెన్నో ఉప్పటి కన్నీళ్ళ యేరులో
మరెన్నెన్నో శుభ్రవేదనలనంతరం
ఎంత నిర్మలమైందీ మనస్సు !!!



అరుణ్‌ కుమార్‌ మరపట్ల
Arun Kumar Marapatla