Thursday, August 31, 2023
ఫిట్‌నెస్ ట్రైనర్లు- అరుణ్ కుమార్ మరపట్ల By Arun Kumar Marapatla Vidya Programme
Fitness-Vidya-23.01.2015
This Programme is telecasted in 6Tv in Vidya Programme. Programme producer Arun Kumar Marapatla అరుణ్ కుమార్ మరపట్ల
నేటి ఆధునిక కాలంలో ఆరోగ్య పరిరక్షణ, దేహ దారుఢ్యంపై
ప్రజల్లో ఎంతగానో అవగాహన పెరిగింది. అందుకే జిమ్‌లు, ఫిటినెస్ సెంటర్ల
బాటపడుతున్నారు. ఊబకాయాన్ని తగ్గించు కొనేందుకు ఫిటినెస్ ట్రైనర్ సూచనలను పాటిస్తూ
చెమటలు చిందిస్తున్నారు. ఇప్పటి యువతను అమితంగా ఆకర్షిస్తున్న అంశం...
సిక్స్‌ప్యాక్ బాడీ. సినీ నటుల తరహాలో ఆరు ఫలకల దేహం కోసం జిమ్‌లలో చేరి, గంటల
తరబడి కష్టపడుతున్నారు. ప్రజాదరణ లభిస్తుండడంతో ప్రతి గల్లీలో జిమ్‌లు
వెలుస్తున్నాయి. వీటిలో శిక్షణ ఇచ్చే ట్రైనర్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఈ
నేపథ్యంలో ఫిట్‌నెస్ ట్రైనింగ్ అనేది ఉద్యోగానికి, ఉపాధికి వంద శాతం భరోసా
కల్పిస్తున్న కెరీర్‌గా గుర్తింపు పొందింది. ఇందులో అవకాశాలకు, ఆదాయానికి లోటు
లేకపోవడంతో ఎంతోమంది ఈ రంగంపై దృష్టి సారిస్తున్నారు. సెలబ్రిటీ ట్రైనర్లకు అధిక
ఆదాయం వ్యాయామ శిక్షకులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు సులువుగా లభిస్తున్నాయి.
జిమ్‌లు, ఫిటినెస్ సెంటర్లలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి. ప్రారంభంలో ఏదైనా జిమ్‌లో
పనిచేసి, తగిన అనుభవం సంపాదించుకున్న తర్వాత సొంతంగా జిమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
మరోవైపు కార్పొరేట్ ఫిట్‌నెస్ సెంటర్లు రంగ ప్రవేశం చేస్తున్నాయి. వీటిలో
ట్రైనర్లకు ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. సినీ నటులు, ప్రముఖులు నెలకు
రూ.లక్ష వరకు వేతనం చెల్లిస్తూ సొంత ట్రైనర్లను నియమించుకుంటు న్నారు. ఫిట్‌నెస్‌పై
టీవీ ఛానళ్లలో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ప్రేక్షకుల సందేహాలకు ట్రైనర్లతో
సలహాలు, సూచనలు ఇప్పిస్తున్నారు. పత్రికలు, మ్యాగజైన్లలోనూ ట్రైనర్ల ఆధ్వర్యంలో
ఫిట్‌నెస్ శీర్షికలు ప్రచురితమవుతున్నా యి. వీటన్నింటి వల్ల వ్యాయామ శిక్షకులకు
ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. నైపుణ్యం కలిగిన శిక్షకులకు డిమాండ్ ఫిట్‌నెస్
ట్రైనర్‌గా రాణించాలంటే ముందు తన ఆరోగ్యాన్ని తప్పనిసరిగా కాపాడుకోవాలి. బాడీ
ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
నైపుణ్యం కలిగిన ఇన్‌స్ట్రక్టర్లకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. కాబట్టి ఆసక్తి
కలిగిన యువత ఈ రంగంలోకి నిస్సందేహంగా అడుగుపెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అర్హతలు: హెల్త్ అండ్ ఫిటినెస్ ట్రైనింగ్‌పై మనదేశంలో సర్టిఫికేషన్ కోర్సులు,
డిప్లొమా ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో వీటిలో
చేరొచ్చు. ఫిటినెస్ శిక్షకులకు ప్రత్యేకంగా ఎలాంటి విద్యార్హతలు అవసరం లేకపోయినా
ఇలాంటి కోర్సులు చేసినవారికి మంచి అవకాశాలు దక్కుతాయి. వేతనాలు: జిమ్‌లో ఫిటినెస్
ట్రైనర్‌కు ప్రారంభంలో నెలకు రూ.10 వేల వేతనం అందుతుంది. తర్వాత అనుభవాన్ని బట్టి
నెలకు రూ.30 వేలకు పైగానే పొందొచ్చు. మోడళ్లు, సినిమా నటులు, రాజకీయ ప్రముఖులు,
వ్యాపారవేత్తలకు, వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగత ట్రైనర్‌గా పనిచేస్తే రూ.లక్షల్లో
ఆదాయం ఉంటుంది. ఫిటినెస్ ట్రైనింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: సింబయోసిస్
సెంటర్ ఫర్ హెల్త్‌కేర్-పుణె, వెబ్‌సైట్: www.schcpune.org ఇండియన్ అకాడమీ ఆఫ్
ఫిటినెస్ ట్రైనింగ్, వెబ్‌సైట్: www.iaftworld.com యూనివర్సిటీ ఆఫ్ అలబామా,
వెబ్‌సైట్: www.ua.edu Bio Diversity-Vidya-23.01.2015 జీవ వైవిధ్యం.. ఇప్పుడు
ప్రతినోటా వినిపిస్తున్న మాట. పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం.. మారుతున్న మానవ జీవన
శైలి.. సాంకేతిక శాస్త్రంలో సరికొత్త ఆవిష్కరణలు వంటి కారణాలతో.. ఎన్నో జీవ జాతులు
ప్రమాదపుటంచుల్లో నిలుచున్నాయి. మరెన్నో అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ
వ్యాప్తంగా ఎన్నో సంస్థలు జీవ వైవిధ్య ప్రాధాన్యాన్ని గుర్తించాయి. జీవ వైవిధ్య
రక్షణకు..ఈ మేరకు తగిన తర్ఫీదునిచ్చేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో
అకడెమిక్ స్థాయిలోనే.. జీవ వైవిధ్య పరిరక్షణకు ఊతమిచ్చే కోర్సులకు రూపకల్పన
చేస్తున్నాయి. వివరాలు.. వృక్ష సంపద సంరక్షణకు..ఫారెస్ట్రీ: విభిన్న జీవ జాతుల
మనుగడకు, వాతావరణ అనుకూలతలకు అత్యంత ఆవశ్యకం అడవులు. ప్రస్తుత హైటెక్ యుగంలో అడవులు
నశిస్తున్నాయి. పర్యవసానంగా అనేక జీవ జాతులు తమ మనుగడ కోల్పోతున్నాయి. ఈ సమస్యలకు
పరిష్కారం సూచిస్తున్నాయి ఫారెస్ట్రీ కోర్సులు. అడవుల సంరక్షణ, వాటి ద్వారా లభించే
సహజ వనరుల వినియోగం తదితరాలపై అవగాహన కల్పించే కోర్సు ఫారెస్ట్రీ. కోర్సులు: పలు
యూనివర్సిటీలు డిగ్రీ, పీజీ స్థాయిలో ఫారెస్ట్రీ, సంబంధిత కోర్సులను
అందిస్తున్నాయి. యూజీసీ- నెట్‌లో ఫారెస్ట్రీ స్పెషలైజేషన్ పరీక్ష జరుగుతోంది.
అవకాశాలు: ఈ కోర్సు పూర్తి చేసిన వారికి అటవీ శాఖ, వ్యవసాయ పరిశోధన విభాగం; సోషల్
ఫారెస్ట్రీ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. బీఎస్సీ (ఫారెస్ట్రీ) అర్హతతో ఇండియన్
ఫారెస్ట్ సర్వీస్ పరీక్షకు హాజరవ్వచ్చు. రాష్ర్ట స్థాయిలో ఏపీపీఎస్సీ నిర్వహించే
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఉద్యోగాలకు అర్హత
లభిస్తుంది. కోర్సులు అందిస్తున్న యూనివర్సిటీలు: దాదాపు అన్ని వ్యవసాయ విశ్వ
విద్యాలయాలు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు బ్యాచిలర్ స్థాయిలో బీఎస్సీ
(ఫారెస్ట్రీ) కోర్సును అందిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ (బైపీసీ) ఉత్తీర్ణులు
అర్హులు. అదే విధంగా సిల్వికల్చర్, ఫారెస్ట్ ప్రొడక్ట్స్, ఎకనామిక్స్ అండ్
మేనేజ్‌మెంట్, వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రీ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, ఆగ్రో
ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లతో పలు యూనివర్సిటీలు ఎమ్మెస్సీ
కోర్సును అందిస్తున్నాయి. భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్
మేనేజ్‌మెంట్.. ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ కోర్సును, డెహ్రాడూన్‌లోని ఇండియన్ కౌన్సిల్
ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కోర్సులను అందిస్తున్నాయి.
వేతనాలు: ప్లాంట్ బయోటెక్ సంస్థలు, ఎన్‌జీఓలు, సోషల్ ఫారెస్ట్రీ విభాగాల్లో చేరిన
వారికి ప్రారంభంలో నెలకు రూ. 10 వేల నుంచి 12 వేల వరకు వేతనం లభిస్తుంది. బీఎస్సీ
ఫారెస్ట్రీ, సంబంధిత కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు: ఉస్మానియా
యూనివర్సిటీ తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
కోర్సు:వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీఅర్హత: బీఎస్సీ(ఎంపీసీ). కోర్సు: ఎకనామిక్స్ అండ్
మేనేజ్‌మెంట్ అర్హత: బీఎస్సీ (బోటనీ/జువాలజీ/ కెమిస్ట్రీ/మ్యాథ్స్/అగ్రికల్చర్).
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ పల్ప్ అండ్ పేపర్ టెక్నాలజీ అర్హత: కెమిస్ట్రీ/అప్లైడ్
కెమిస్ట్రీలో పీజీ. మెరైన్ కన్జర్వేషన్ : జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రాముఖ్యం
పెరుగుతున్న నేపథ్యంలో రూపుదిద్దుకున్న మరో కొత్త కోర్సు మెరైన్ కన్జర్వేషన్.
సముద్రాలు, నదుల్లోని జల జీవ జాతులను సంరక్షించే మార్గాలను అధ్యయనం చేయడమే ఈ కోర్సు
ప్రధానోద్దేశం. జలాంతర్భాగంలో నివసించే జీవుల మనుగడకు ఎదురవుతున్న సమస్యలు-పరిష్కార
మార్గాలు; అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలు వంటివి అధ్యయనాంశాలుగా ఉంటాయి.
పర్యావరణం, మెరైన్ చట్టాలు, జల-ఆర్థిక విధానాలు వంటి అంశాలపైనా శిక్షణ లభిస్తుంది.
కోర్సులు: ప్రస్తుతం మెరైన్ బయాలజీ/ఎకాలజీ పేరుతో పలు కోర్సులు పీజీ స్థాయిలో
అందుబాటులో ఉన్నాయి. అందిస్తున్న యూనివర్సిటీలు: గోవా యూనివర్సిటీ (గోవా) కోర్సు:
ఎమ్మెస్సీ మెరైన్ సైన్స్ (మెరైన్ బయాలజీ, మెరైన్ జియాలజీ, మెరైన్ కెమిస్ట్రీ,
మెరైన్ ఓషనోగ్రఫీ) యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కత (కోల్‌కత) కోర్సు: ఎమ్మెస్సీ (మెరైన్
సైన్స్) పాండిచ్చేరి యూనివర్సిటీ కోర్సు: ఎమ్మెస్సీ (మెరైన్ బయాలజీ) ఆంధ్రా
యూనివర్సిటీ కోర్సు: ఎమ్మెస్సీ (మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్, మెరైన్ బయో టెక్నాలజీ)
అవకాశాలు: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, కేంద్ర శాస్త్ర, సాంకేతిక పర్యావరణ
శాఖ, ఓఎన్‌జీసీ చమురు అన్వేషణ సంస్థలు, సీ-ఫుడ్ ఎక్స్ పోర్ట్సంస్థలు, షిప్పింగ్
సంస్థలు, ఎన్‌జీఓల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నెలకు కనీసం రూ. 10 వేల నుంచి రూ.
20 వేల వేతనం ఖాయం. ఎన్విరాన్‌మెంట్ సైన్స్: జీవ వైవిధ్యం ముప్పునకు ప్రధాన కారణం
పర్యావరణ కాలుష్యం. పారిశ్రామిక, మానవ ప్రేరిత కాలుష్యాలే కారకాలుగా పలు జాతులు
అంతరిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రూపొందిన కోర్సే ఎన్విరాన్‌మెంట్ సైన్స్.
భౌతిక, రసాయన, జీవశాస్త్ర అంశాలను శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసే కోర్సు
ఎన్విరాన్‌మెంట్ సైన్స్. వాతావరణ మార్పులు, శక్తి సంరక్షణ, జీవ వైవిధ్యం, భూగర్భ జల
వనరులు, జల-వాయు-శబ్ద కాలుష్యాలు, ఇతర కాలుష్యాలు (పర్యావరణం, పా్లిస్టిక్
వ్యర్థాలు తదితర) వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేస్తారు. ‘క్లీన్ ఎన్విరాన్‌మెంట్’
అనే భావన పెరుగుతున్న నేపథ్యంలో కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగావకాశాలు ఖాయం.
కోర్సులు: పీజీ (ఎమ్మెస్సీ/ఎంఈ) స్థాయిలోనే అందుబాటులో ఉన్నాయి. అర్హత బీఎస్సీ.
అధిక శాతం వర్సిటీలు ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంట్ సైన్స్ను.. ఎంఈలో ఎన్విరాన్‌మెంటల్
ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్స్‌ను
అందిస్తున్నాయి. అవకాశాలు: గనులు, ఎరువులు, ఆహార తయారీ పరిశ్రమలు, స్వచ్ఛంద
సంస్థల్లో ఉద్యోగాలు గ్యారెంటీ. వేతనాలు: ఎంచుకున్న సెక్టార్ ఆధారంగా నెలకు రూ. 10
వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనాలు లభిస్తాయి. ఎమ్మెస్సీ ఆఫర్ చేస్తున్న
ఇన్‌స్టిట్యూట్‌లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (బెంగళూరు) వైల్డ్‌లైఫ్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డెహ్రాడూన్) బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (ముంబై)
ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (న్యూఢిల్లీ) స్కూల్ ఆఫ్ ప్లానింగ్
అండ్ ఆర్కిటెక్చర్ (న్యూఢిల్లీ), పీహెచ్‌డీ ఇన్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్‌ను
అందిస్తోంది. ఆంత్రోపాలజీ: జీవ వైవిధ్య మనుగడకు ముప్పు దిశగా కేవలం జంతువులే
కాకుండా అనేక మానవ జాతుల కూడా అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా దట్టమైన అడవుల్లో
నివసించే ఆదిమ జాతుల ఉనికి ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో మానవ జాతులు,
వాటి మూలాలు, ప్రస్తుత సమస్యలు, పరిష్కార మార్గాలు వంటి అంశాలపై అధ్యయనం చేసే
శాస్త్రమే ఆంత్రోపాలజీ. దీంతోపాటు ఆయా జాతుల తమ పరిసరాల పర్యావరణ పరిరక్షణకు
చేపడుతున్న చర్యలు, వాటి ఫలితాలు వంటివాటిపై శిక్షణ లభిస్తుంది. దాదాపు అన్ని
యూనివర్సిటీలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. మన రాష్ర్టంలో ఆచార్య నాగార్జున
యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్
యూనివర్సిటీల్లో ఈ కోర్సు ఉంది. కోర్సు పూర్తి చేసిన వారికి బోధన, పరిశోధన,
మ్యూజియంలలో అవకాశాలు లభిస్తాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ప్లానింగ్ కమిషన్
వంటి జాతీయ స్థాయి సంస్థలతోపాటు యూఎన్‌ఓ అనుబంధ యునెస్కో,యూనిసెఫ్ వంటి
విభాగాల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ అన్ని
జీవరాశులకు సంబంధించి అధ్యయనంచేసే కోర్సు వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ
కోర్సు. ఆయా జీవాలకు ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలను చూపే అంశాలతో కోర్సు
కరిక్యులం రూపుదిద్దుకుంది. ఇటీవల కాలంలో వాణిజ్య పరంగానే కాకుండా, వ్యక్తిగతంగా
కూడా పెంపుడు జంతువులపై సమాజంలో ఆసక్తి పెరగడం, ఆ మేరకు నిపుణుల అవసరం ఏర్పడంతో
కోర్సు ఉత్తీర్ణుల భవిష్యత్తుకు ఢోకా లేదు. రాష్ర్టంలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ
యూనివర్సిటీలో బ్యాచిలర్, మాస్టర్ స్థాయిలో వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ
కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ (బైపీసీ) ఉత్తీర్ణులు బ్యాచిలర్
కోర్సుకు, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ ఉత్తీర్ణులు మాస్టర్స్ కోర్సుకు అర్హులు. వెటర్నరీ
కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. జాతీయ ప్రవేశ పరీక్ష ద్వారా దేశంలోని మొత్తం బీవీఎస్సీ అండ్
ఏహెచ్ సీట్లలో 15 శాతం సీట్లను భర్తీ చేస్తుంది. ఇంటర్మీడియెట్ (బైపీసీ)
ఉత్తీర్ణులు ఈ పరీక్షకు అర్హులు. బ్యాచిలర్ కోర్సులను అందిస్తున్న
ఇన్‌స్టిట్యూట్‌లు ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (గుజరాత్) బిర్సా అగ్రికల్చరల్
యూనివర్సిటీ (జార్ఖండ్) సెంట్రల్ అగ్రికల్చర్ యూనవర్సిటీ (ఇంఫాల్) పాండిచ్చేరి
యూనివర్సిటీ (పుదుచ్చేరి) అవకాశాలు: బ్యాచిలర్ కోర్సు పూర్తి చేసుకుంటే వెటర్నరీ
హాస్పిటల్స్, పశు సంవర్ధక కేంద్రాలు, ఇన్సూరెన్స్ సంస్థలు, బ్యాంకులు, డైరీ ఫార్మ్
వంటి విభాగాలు, జీవ ఔషధ తయారీ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సొంతంగా
ప్రాక్టీస్ క్లినిక్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. ‘వైవిధ్యం’గా ఉంటేనే ఇతర రంగాలతో
పోల్చితే జీవ వైవిధ్య సంబంధ కోర్సుల్లో చేరే వ్యక్తులకు ప్రత్యేక లక్షణాలు ఉండాలి.
నిజమైన ఆసక్తి, చేరాలనుకున్న కోర్సు, సంబంధిత రంగంలో రాణించేందుకు సహనం అవసరం.
ఉదాహరణకు వెటర్నరీ సైన్స్ అంటే ఇప్పటికీ పలువురు విద్యార్థుల్లో కొంత చిన్నచూపు
ఉంది. అదే విధంగా ఆంత్రోపాలజీని పరిగణనలోకి తీసుకుంటే..అది క్షేత్రస్థాయి పర్యటనలు
ఆవశ్యకమైన విభాగం. ఇలా.. జీవ వైవిధ్య విభాగాల్లో ఒక్కో విభాగానికి విధుల పరంగా
వైవిధ్యభరితమైన అవసరాలు ఉంటాయి. ఇతర రంగాలతో పోల్చుకుంటే పని గంటల విషయంలో కూడా
వ్యత్యాసాలు ఉంటాయి. ఔత్సాహిక అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే అవసరమైన
లక్షణాలను అలవర్చుకుంటే.. పీజీలోనే అధిక శాతం అందుబాటులో ఉన్న ఈ కోర్సుల్లో
రాణించడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రవేశాలు ఇలా.. దాదాపు ఈ కోర్సులన్నీ మాస్టర్
డిగ్రీ స్థాయిలోనే ఉండటంతో ఆయా యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు ప్రత్యేకంగా
ప్రవేశ పరీక్షల ద్వారా, ప్రభుత్వ యూనివర్సిటీలు,సెంట్రల్ వర్సిటీలు సంబంధిత
సబ్జెక్ట్‌లో గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. యూనివర్సిటీలు,
ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు జనవరి నుంచి ప్రక్రియ మొదలవుతుంది.
వీటికోసం ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల వెబ్‌సైట్స్ చూడొచ్చు. జల జీవ సంరక్షణకు ఫిషరీస్
అండ్ ఆక్వాకల్చర్ ఉపరితల జీవాలతోపాటు జల జీవాల మనుగడకు సైతం ముప్పు ఏర్పడుతోంది. జల
జీవాల్లో అరుదైన జీవంగా గుర్తింపు పొందిన బ్లూ డాల్ఫిన్ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని
తాజాగా వస్తున్న వార్తలే ఇందుకు నిదర్శనాలు. ఈ నేపథ్యంలో జల జీవ రాశుల సంరక్షణకు
ఉద్దేశించిన కోర్సు ఫిషరీస్ సైన్స్ అండ్ ఆక్వా కల్చర్. జల జీవ రాశుల ఉనికి, పెంపకం,
వాటి సంరక్షణ, భూగర్భ జలంలోని మొక్కలు సంబంధింత అంశాల అధ్యయనంతో కూడిన కోర్సు ఇది.
చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల వాణిజ్యంలో ప్రపంచంలో భారతదేశం మూడో స్థానంలో నిలిచిన
నేపథ్యంలో ఈ కోర్సు పూర్తయితే అవకాశాలకు కొదవలేదు. దేశంలో అధికంగా మాస్టర్స్
స్థాయిలోనే ఈ కోర్సు అందుబాటులో ఉంది. మన రాష్ట్రంలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ
యూనివర్సిటీ బ్యాచిలర్ స్థాయిలో ఫిషరీస్ సైన్స్ అండ్ ఆక్వాకల్చర్, పీజీ స్థాయిలో
ఆక్వా కల్చర్, ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ స్పెషలైజేషన్లను అందిస్తోంది. అవకాశాలు:
ఫిషరీ ఫార్మ్, హేచరీ మేనేజ్‌మెంట్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌లలో
ఉద్యోగావకాశాలుంటాయి. బయో డైవర్సిటీ ‘ప్రత్యేకంగా’... బయో డైవర్సిటీ, సంరక్షణకు
ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో నేరుగా బయో డైవర్సిటీ స్పెషలైజేషన్‌తో పలు
ఇన్‌స్టిట్యూట్‌లు పీజీ కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. జీవ జాతుల సంరక్షణ,
నిర్వహణ, సహజ వనరుల సుస్థిర వినియోగం వంటి అంశాలపై శిక్షణ ఉంటుంది. పర్యావరణ
సిద్ధాంతాలు, పద్ధతులపై శాస్త్రీయ దృక్పథంతో తర్ఫీదునిస్తారు. బయో డైవర్సిటీ విధి
విధానాలు, జాతుల భావనలు, జీవ వైవిధ్యం, సంరక్షణ, జంతు సంరక్షణ మార్గాలు వంటి
అంశాలపై శిక్షణనిచ్చే విధంగా ఈ కోర్సులకు రూపకల్పన జరిగింది. ప్రస్తుతం త్రిపుర
యూనివర్సిటీ, పాట్నా యూనివర్సిటీ, గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలు
ఎమ్మెస్సీ బయో డైవర్సిటీ స్పెషలైజేషన్ కోర్సులను అందిస్తున్నాయి. అస్సాం
యూనివర్సిటీ ఏడాది వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్ బయో డైవర్సిటీ కన్జర్వేషన్ కోర్సును
ఆఫర్ చేస్తోంది. ఇటీవలే ఇగ్నో బయోడైవర్సిటీలో ఆన్‌లైన్ ప్రోగ్రాంను ప్రారంభించింది.
micro biology సూక్ష్మ జీవశాస్త్రం(మైక్రో బయాలజీ)...... మహా సముద్రం లాంటి
జీవశాస్త్రంలో ఒక భాగం. మనిషి కంటికి కనిపించని అతి సూక్ష్మ జీవుల అధ్యయనమే..
సూక్ష్మ జీవశాస్త్రం. భూగోళంపై లెక్కలేనన్ని సూక్ష్మజీవులు ఆవాసం ఏర్పరచుకున్నాయి.
వాటిలో మనిషికి శత్రువులు, మిత్రులు.. ఉపయోగపడేవి, అప కారం చేసేవి.. రెండూ ఉన్నాయి.
శత్రు జీవు లను నిర్మూలించాలి. మిత్ర జీవులను కాపా డుకోవాలి. వాటిని అనుకూలంగా
మార్చు కొని, జీవితాన్ని మరింత సుఖవంతంగా మార్చుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించు
కోవాలి. ఇవన్నీ చేసేవారే.. మైక్రో బయాల జిస్ట్‌లు. మంచి వేతనంతోపాటు పరిశోధనల
ద్వారా సమాజానికి సేవ చేసేందుకు అవకాశం కల్పించే కెరీర్.. మైక్రో బయాలజిస్ట్. ఐటీ
ఇంజనీర్లకంటే అధిక వేతనాలు మైక్రో బయాలజీలో అగ్రికల్చరల్, సాయిల్, మెడికల్,
ఎన్విరాన్‌మెంటల్, ఇండస్ట్రియల్, ఫుడ్ మైక్రోబయాలజీ తదితర ఉప విభాగాలు ఉన్నాయి.
ప్రస్తుతం దేశ విదేశాల్లో మైక్రో బయాలజిస్ట్‌లకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి.
పర్యావరణం, మెడిసిన్, పబ్లిక్ హెల్త్, పేపర్, టెక్స్‌టైల్, లెదర్, ఆహారం.. తదితర
పరిశ్రమల్లో వీరికి డిమాండ్ పెరుగు తోంది. పరిశోధనల్లో మంచి అనుభవం సంపా దించి,
నైపుణ్యాలు పెంచుకున్న మైక్రో బయాల జిస్ట్‌లకు ఐటీ ఇంజనీర్ల కంటే అధిక వేతనాలు
అందుతున్నాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. అవకాశాలు పుష్కలం మైక్రో బయాలజీ
కోర్సును పూర్తిచేస్తే.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, హెల్త్‌కేర్ సెంటర్లు,
ఆసుపత్రుల్లో ఉద్యోగావకాశాలు దక్కించుకోవచ్చు. ఫుడ్ క్వాలిటీ ఆఫీసర్, పొల్యూషన్
కంట్రోలర్, ప్రొడక్ట్ ఇంజనీర్, ఫుడ్ టెక్నాలజిస్ట్, ఇండస్ట్రియల్ మైక్రో
బయాలజిస్ట్, పాథాలజీ ల్యాబ్‌ల్లో సైంటిస్ట్, పేటెంట్ అటార్నీ, బిజినెస్
డెవలప్‌మెంట్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్.. తదితర కొలువులు అందుబాటులో ఉన్నాయి.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్), డిపార్టుమెంట్ ఆఫ్
సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ లాంటి ప్రభుత్వ రంగ
సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీగా, పరిశోధకులుగానూ
స్థిరపడొచ్చు. కొన్ని ప్రభుత్వ సంస్థలు మైక్రో బయాలజీలో పరిశోధనలు చేపట్టేందుకు యువ
సైంటిస్ట్‌ల కోసం ఫాస్ట్‌ట్రాక్ ప్రాజెక్ట్‌లను ప్రవేశపెడుతున్నాయి. ప్రత్యేకంగా
నిధులు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నాయి. అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్
పూర్తిచేసిన తర్వాత మైక్రో బయాలజీలో గ్రాడ్యుయేషన్ చదవొచ్చు. ఎంఎస్సీ, పీహెచ్‌డీ
కూడా పూర్తిచేస్తే ఉద్యోగార్హతలు పెరుగుతాయి. వేతనాలు మైక్రోబయాలజీలో
గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి ప్రారంభంలో నెలకు రూ.15 వేల
నుంచి రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. నైపుణ్యాలు పెంచుకుంటే కార్పొరేట్
సంస్థల్లో ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు భారీ వేతన ప్యాకేజీ
పొందొచ్చు. మైక్రో బయాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఉస్మానియా
యూనివర్సిటీ వెబ్‌సైట్: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ వెబ్‌సైట్:
www.andhrauniversity.edu.in యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్‌సైట్:
www.uohyd.ac.in నాగార్జునా విశ్వవిద్యాలయం వెబ్‌సైట్:
www.nagarjunauniversity.ac.in యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వెబ్‌సైట్: www.du.ac.in
Vidya-Lether Technology ప్రాచీన కాలంలో జంతువుల చర్మాన్నే మనుషులు దుస్తులుగా
ధరించేవారు. ఆధునిక యుగంలో రకరకాల వస్త్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. జంతు
చర్మంతో రూపొందించిన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. తోలుతో తయారు
చేసిన పాదరక్షలు, బ్యాగులు, పర్సులు, బెల్ట్‌లు, రెయిన్ కోట్లకు మంచి డిమాండ్ ఉంది.
తోలు వస్తువుల వాడకాన్ని హోదాకు చిహ్నంగా భావిస్తున్నారు. భారత్‌లో తోలు పరిశ్రమ
వేగంగా అభి వృద్ధి చెందుతోంది. తోలు ఎగుమతుల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరు
తోంది. మనదేశంలో ప్రతిఏటా 2 బిలియన్ చదరపు అడుగుల ముడి తోలు ఉత్పత్తవు తోంది. ఈ
రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకా శాలు పుష్కలంగా లభిస్తున్నాయి. లెదర్ టెక్నా లజీని
కెరీర్‌గా ఎంచుకుంటే.. భవిష్యత్తుకు ఢోకా ఉండదని నిస్సందేహంగా చెప్పొచ్చు. అవకాశాలు
ఎన్నెన్నో.. లెదర్ టెక్నాలజీ కోర్సులను చదివిన వారికి మెరుగైన అవకాశాలు
దక్కుతున్నాయి. ప్రధానంగా తోలు శుద్ధి పరిశ్రమల్లో లెదర్ టెక్నాలజిస్టుల అవసరం
ఎక్కువగా ఉంది. మనదేశంలో హైదరాబాద్, చెన్నై, ఆగ్రా, కాన్పూర్, జలంధర్, కోల్‌కతా,
ముంబై తదితర నగరాల్లో తోలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. లెదర్ గూడ్స్, లెదర్
గార్మెంట్స్ కంపెనీలు లెదర్ టెక్నాలజిస్టులను నియమించుకుంటు న్నాయి. లెదర్
కెమికల్స్ కంపెనీల్లోనూ అవకాశాలుంటాయి. దేశ విదేశాల్లో తోళ్ల వ్యాపారం నిర్వహించే
సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. ఈ రంగంలో కొంత అనుభవం సంపాదించిన తర్వాత సొంతంగా
లెదర్ ఫినిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే అధిక ఆదాయం పొందడానికి ఆస్కారం
ఉంటుంది. తగిన ఆసక్తి ఉంటే యూనివర్సిటీ లు/కళాశాలల్లో ఫ్యాకల్టీగా కూడా
స్థిరపడొచ్చు. టెక్నాలజీని అప్‌డేట్ చేసుకోవాలి లెదర్ టెక్నాలజిస్టుగా
రాణించాలంటే.. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం, మంచి కమ్యూనికేషన్
స్కిల్స్, శ్రమించే తత్వం, నాయకత్వ లక్షణాలు ఉండాలి. తోలు శుద్ధి పరిశ్రమలు
సాధారణంగా జనావాసాలకు దూరంగా ఏర్పాటవుతాయి. ఇందులో రసాయనాల వినియోగం ఎక్కువ.
కాబట్టి అక్కడ పనిచేసేందుకు సిద్ధపడాలి. లెదర్ టెక్నాలజిస్టులకు కెమిస్ట్రీ,
ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్,
కంప్యూటర్ అప్లికేషన్స్‌పై బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అర్హతలు: లెదర్ టెక్నాలజీలో
డిప్లొమా, బీటెక్, ఎంటెక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టులతో
ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత డిప్లొమా/బీటెక్‌లో చేరొచ్చు. ఎంటెక్ కూడా
పూర్తిచేస్తే మంచి అవకాశాలు ఉంటాయి. వేతనాలు: లెదర్ టెక్నాలజీలో బీటెక్ పూర్తిచేసిన
వారు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం అందుకోవచ్చు. తర్వాత
అనుభవం, పనితీరు ఆధారంగా వేతనం పెరుగుతుంది. లెదర్ టెక్నాలజీ కోర్సులను ఆఫర్
చేస్తున్న సంస్థలు గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ-గోల్కొండ,
హైదరాబాద్ సెంట్రల్ లెదర్ రీసెర్‌చ ఇన్‌స్టిట్యూట్ - చెన్నై వెబ్‌సైట్:
www.clri.org అన్నా యూనివర్సిటీ-చెన్నై వెబ్‌సైట్: www.annauniv.edu వెస్ట్
బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ-కోల్‌కతా వెబ్‌సైట్: www.wbut.ac.in
హర్‌కోర్ట్ బట్లర్ టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్-కాన్పూర్ వెబ్‌సైట్: www.hbti.ac.in
విదేశాల్లోనూ అవకాశాలు ‘‘పాస్.. ఫెయిల్‌తో సంబంధం లేకుండా మెరుగైన కెరీర్‌ను
అందించే కోర్సులు... లెదర్ టెక్నాలజీ, ఫుట్‌వేర్ టెక్నాలజీ. మూడున్నరేళ్ల కోర్సు
సమయంలో ఏడాదిపాటు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక ప్రారంభ వేతనం
రూ.10వేల వరకూ ఉంటుంది. మనదేశంతోపాటు విదేశాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి.
లెదర్ టెక్నాలజీ కోర్సులను అభ్యసిస్తే మంచి వేతనంతో కెరీర్‌ను అద్భుతంగా
తీర్చిదిద్దుకోవచ్చు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment